ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు దారుణం : జనసేన

Jun 25,2024 20:24
ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు దారుణం : జనసేన

స్థలాలను పరిశీలిస్తున్న నాయకులు
ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు దారుణం : జనసేన
ప్రజాశక్తి-నెల్లూరు : ప్రభుత్వ స్థలాల్లో వైసిపి కార్యాలయాలను నిర్మించడం దారుణమని జనసేన పార్టీ జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్‌ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వెంకటేశ్వరపురం ప్రాంతంలో కబ్జాకు గురైన స్థలాన్ని జనసేన పార్టీ నాయకులు మంగళ వారం పరిశీలించారు. జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్‌ మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల నిర్మాణ వ్యవహారంలో గత ప్రభుత్వ తీరుపై నూనె మల్లికార్జున యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వాటిని అన్యాక్రాంతం చేయడం బాధాకరమన్నారు. అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి డిమాండ్‌ చేశారు. నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో జరిగిన ఘటనపై జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ బాధితుల పట్ల స్పందించడం అభినందనీయమన్నారు. తమ పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజరు కుమార్‌ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకులు శ్రీరామ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌, వీర మహిళలు నాగరత్నం యాదవ్‌, వై రవి, కే కష్ణారెడ్డి, జి హరి రెడ్డి, గుర్రం కిషోర్‌, ఎం సురేష్‌, పవన్‌, డి సురేష్‌, శ్రీకాంత్‌, మహేష్‌, హసీనా, శర్మ , ప్రశాంత్‌ గౌడ్‌ ఉన్నారు.

➡️