విధుల్లోకి తీసుకోవాలని కార్మికుల బైక్‌ ర్యాలీ

Jun 28,2024 23:17
విధుల్లోకి తీసుకోవాలని కార్మికుల బైక్‌ ర్యాలీ

ప్రజాశక్తి -సామర్లకోట రాక్‌ సిరమిక్స్‌లో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాక్‌ సిరామిక్స్‌ కార్మికులు శుక్రవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పరిశ్రమ వద్ద నుంచి అచ్చంపేటలోని పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఇంటి వద్దకు బైక్‌ ర్యాలీగా వెళ్లి ఎంఎల్‌ఎ చినరాజప్పకు వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా భాధిత కార్మికులు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండా అన్యాయంగా విధుల నుంచి తొలగించారన్నారు. నెలల తరబడి పరిశ్రమ ఎదుట ఆందోళన చేపడుతున్నా యాజమాన్యం తమగోడు వినిపించు కోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో తమ నిరసనలు ఉదతం చెయ్యనున్నట్టు వారు తెలిపారు.

➡️