విద్యార్థుల పాఠశాల, కళాశాల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బడి బస్సు నడపాలి : ఎస్‌ఎఫ్‌ఐ

అనంతపురం : విద్యార్థుల పాఠశాల, కళాశాల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బడి బస్సు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ … విద్యార్థుల పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా బడి బస్సు నడపాలన్నారు. చిలమత్తూరు లేపాక్షి పెనుగొండ మడకశిర సోమందేపల్లి కలిపి రొద్దం మండలం నుంచి వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి హిందూపురం పట్టణంలో వివిధ పాఠశాల కళాశాలకు వస్తున్నారని చెప్పారు. విద్యార్థుల కళాశాల సమయానికి అనుగుణంగా గతంలో నడిపిన బడి బస్సులను తిరిగి పున్ణ ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంగా కోరుతున్నామన్నారు. విద్యార్థులకు అనుగుణంగా బడి బస్సులు నడపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆర్టీసీ డిపో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జై చంద్ర, తరుణ్‌, మోమిన్‌, సురేష్‌ పాల్గొన్నారు.

➡️