మురగళ్లలో భూసార పరీక్షలు

Jul 2,2024 21:59
మురగళ్లలో భూసార పరీక్షలు

భూసార పరీక్షలు నిర్వహిస్తున్న అధికారిమురగళ్లలో భూసార పరీక్షలు..ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:మండలంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది ద్వారా మట్టి నమూనా సేకరణ ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు. ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి కిషోర్‌ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్‌ బాబు మాట్లాడుతూ 2024- 25 సంవత్సరానికి గాను నేలలోని పోషకాల శాతం చౌడు భూములు పునరుద్ధరణ మరియు వేయబోవు పంటలకు కావలసిన ఎరువులు మోతాదును తెలుసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం మట్టి నమూనా సేకరించి భూసార పరీక్షలు ఉచితంగా చేసి పరీక్షా ఫలాలను అందిస్తుందన్నారు. ఆత్మకూరు మండలానికి 767 మట్టి నమూనాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఅన్నారు. భూసార పరీక్షలు చేయించుకోదలచిన రైతులు ఆయా ఆధార్‌, పొలం పాస్‌ పుస్తకం కాపీలతో సంబంధిత రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి సందర్శించి సరైన పద్ధతిలో మట్టి నమూనాలు సేకరించి నెల్లూరులోని భూసార పరీక్షా కేంద్రానికి పంపి, భూసార పరీక్ష ఫలితాలను అందిస్తారు. ప్రస్తుతం భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తర్వాత సీజనల్‌ లో వేయబోయే పంటలకు ఏ యే ఎరువులు ఎంత వేయాలో తెలుస్తుందని తెలిపారు.

➡️