ఎమ్మెల్యే స్వామి ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాత శింగరాయకొండ శ్రీవరహలక్ష్మినరసింహ స్వామి దేవస్థానాన్ని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సింగయ్య, మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు, నక్క బ్రహ్మేశ్వరరావు, చిగురుపాటి శేషగిరి, కాకా శ్రీనివాసరావు, షేక్‌ మున్నా, సన్నెబోయిన మాలకొండయ్య, షేక్‌ గౌస్‌, చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️