అంగన్వాడీల సమ్మె నోటీసు

అంగన్వాడీల సమ్మె నోటీసు

 సమ్మె నోటీసు అందజేస్తున్న అంగన్వాడీలు

          లేపాక్షి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్లలో గురువారం సిఐటియు, ఎఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మె నోటీసు అందచేశారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు, రిటైర్మెంట్‌ వయసు పెంపు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ. 5 లక్షలు, మెడికల్‌ సెలవులు, సంక్షేమ పథకా లు, ప్రమోషన్లు, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ సంపూర్ణమ్మ, దేవి, సుజాత, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

➡️