ఇష్టపడి చదివి ఉన్నతస్థాయిలో స్థిరపడాలి

Feb 14,2024 22:34

సమావేశంలో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి

                  కదిరి టౌన్‌ : చదువుతోనే ఉన్నత స్థాయి సాధ్యమని విద్యార్థులు బాగా చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కదిరి పర్యటనకు వచ్చిన భువనేశ్వరి మంగళవారం రాత్రి కదిరి రూరల్‌ మండలం ఎరుకులవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్‌ పాఠశాలలో బస చేశారు. బుధవారం ఉదయం నారా భువనేశ్వరి హరీష్‌ పాఠశాలలో కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. మొదట ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌. కిరణ్‌ నారా భువనేశ్వరికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండి బాగా చదువుకొని పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కందికుంట వెంకట ప్రసాద్‌, నాయకులు పర్వీన్‌ బాను, బాబ్జాన్‌, సురేష్‌ బాబు, హైదర్‌ వలి, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️