ఉత్తమ శిక్షణ, ఉన్నతమైన విద్య ‘విజ్ఞాన్‌’ లక్ష్యం

విజ్ఞాన్‌ పాఠశాల

       ఓబుళదేవర చెరువు : ఉత్తమ శిక్షణ, ఉన్నతమైన విద్యను అందించి విద్యార్థులను తీర్చిదిద్దేలా ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలోని విజ్ఞాన్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ ఎం.ఫక్రుద్దీన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు అనుభవజ్ఞులతో కూడిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య బోధన అందిస్తూ, క్రమశిక్షణను నేర్పుతున్నట్లు చెప్పారు. డబ్బుకు ప్రాధాన్య ఇవ్వకుండా ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి ఏటా పదవ తరగతి ఫలితాల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. నవోదయ ,సైనిక్‌ స్కూల్‌, ఏపీ ఆర్‌ఎస్‌, ఏపీఆర్జేసీ తదితర పోటీ పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు.

➡️