ఉపాధ్యాయ సమస్యలపై ‘సజ్జల’కు వినతి

Dec 12,2023 21:44

సజ్జల రామకృష్ణారెడ్డికి సమస్యలు వివరిస్తున్న నాయకులు

                పుట్టపర్తి అర్బన్‌ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వైయస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తోపాటు పిఆర్‌టియు రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించారు. ఈ మేరకు నాయకులు అశోక్‌ కుమార్‌ రెడ్డి, పివి రమణారెడ్డి, రజినీకాంత్‌ రెడ్డి, సుందర్‌ లతో పాటు ఎమ్మెల్సీలు ఎం వి రామచంద్ర రెడ్డి, కల్పలత రెడ్డి, అప్పి రెడ్డి మంగళవారం విజయవాడలో సజ్జలను కలిసి సమస్యను వివరించారు. పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్‌ లోన్లు, మెడికల్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. వేతనాలు ప్రతినెల 1వ తేదీన చెల్లించాలన్నారు.

➡️