ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 31,2023 22:00

సమ్మె శిబిరంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌

                    పుట్టపర్తి రూరల్‌ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐఇయు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. 12వ రోజు సమ్మెలో భాగంగా ఆదివారం సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈసమ్మెలో పాల్గొన్న ఇంతియాజ్‌ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవటం దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఇంతవరకు కనీస వేతనం , పనికి తగ్గ సమాన వేతనం , ఉద్యోగ భద్రత , ఆరోగ్య భద్రత ప్రభుత్వం కల్పించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, జేఏసీ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి, వెంకటరమణ, రవి, నాగరాజు, ఓబులేసు జనసేన జిల్లా నాయకులు పత్తి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️