గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధం 

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

        జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్‌-2 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలియజేశారు. గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జోహార్‌ రెడ్డి విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీటితో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణాలు, రీసర్వే తదితర వాటిపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రూప్‌ 2 పరీక్షలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు పుట్టపర్తి క్రైమ్‌ : జిల్లావ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్షలకు హాజరయ్య అభ్యర్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోందని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి టి.మధుసూదన్‌ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన డిపో మేనేజర్లు, ట్రాఫిక్‌, గ్యారేజ్‌ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు హాజరు తర్వాత తిరిగి అభ్యర్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లడానికి ఏర్పాటు చేయాలని ఆర్టీసీ సిబ్బందిని ఆయన ఆదేశించారు.

➡️