టిడిపిలో పలువురు చేరిక

Feb 1,2024 21:20

పార్టీలోకి చేరిన వారితో కందికుంట

                     కదిరి టౌన్‌ : కదిరి రూరల్‌ మండల పరిధిలోని పట్నం, కొండమనాయునిపాళ్యం గ్రామాలకు చెందిన పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారందరికి కందికుంట టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా వైసిపికి చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి భారీ ఎత్తున చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చెన్నకేశవులు, నాగూరి శ్రీనివాస రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తనకల్లు : మండల పరిధిలోని పరాకువాండ్లపల్లిలో కదిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో పలువురు బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. బిజెపి మండల కన్వీనర్‌ గుడుపల్లి రెడ్డప్ప రెడ్డి, నాగిరెడ్డి, రామాంజులు రెడ్డి, వంశితో పాటు 20 కుటుంబాలు పరాకువాండ్లపల్లిలో ఏర్పాటు చేసిన సభలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి విద్యాసంస్థల అధినేత పవన్‌ కుమార్‌ రెడ్డి, బంగారు కృష్ణమూర్తి, న్యాయవాది నాగేంద్రప్రసాద్‌, మండల కన్వీనర్‌ రెడ్డి శేఖర్‌ రెడ్డి, జనసేన ఎంపీటీసీ అమర్‌ కార్తికేయ, విదుర శేఖర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు రాజశేఖర్‌ బాబు, మాజీ మండల కన్వీనర్లు శంకర్‌ నాయుడు, రాజారెడ్డి, కుంచె నాగేంద్ర ప్రసాద్‌, మల్లికార్జున, తోట సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️