టిడిపిలో పలువురు చేరిక

Feb 14,2024 22:35

టిడిపిలోకి చేరిన వారితో పల్లె రఘునాథరెడ్డి    

                   కొత్తచెరువు : మండలం పరిధిలోని మైలేపల్లికి చెందిన 30 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వైసిపి ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పల్లె వీరికి టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి ఎస్‌ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, కన్వీనర్‌ వలిపి శ్రీనివాసులు, కేశప్ప, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

➡️