పవర్‌ పార్కుల ఏర్పాటుకు భూ సేకరణ వేగవంతం

Feb 13,2024 21:44

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

                         పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో విండ్‌, సోలార్‌ పవర్‌ పార్కుల ఏర్పాటుకు భూ సేకరణ పక్రియ వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కోర్టు హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో సోలార్‌ పవర్‌ పనుల భూ సేకరణకు సంబంధించి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా పరిధిలో405 ఎకరాల భూ సేకరణ పక్రియ పూర్తయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆదాని సంస్థ పనులు చేపట్టిందన్నారు. 500 ఎం డబ్ల్యు చిత్రావతి పంపు హై డోర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయడానికి అదనపు భూమిని తాడిమర్రి మండలం పెద్దకోటలో 24.82 ఎకరాలు కేటాయించాలన్నారు. రామగిరిలో 300 ఎం డబ్ల్యు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి 8 .44 ఎకరాల భూమిని ఎస్‌ఇసిఐ వారికి కేటాయించాలని తెలిపారు. భూ సేకరణ పక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెట్‌ క్యాప్‌ ఎమ్‌డి రమణారెడ్డి, ఉమ్మడి జిల్లాల నెట్‌ కేఫ్‌ అధికారి వేణుగోపాల్‌ రెడ్డి, ధర్మవరం, తాడిమర్రి, కనగానపల్లి, రామగిరి మండలాల రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️