పుట్టపర్తిలో పార్టీకి పూర్వవైభవం : మాజీమంత్రి పల్లె

Dec 10,2023 20:47

 పార్టీలోకి చేరిన వారితో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

            ఓబుల దేవర చెరువు : పుట్టపర్తి నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువస్తామనిమాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఓడి చెరువు నుండి తంగేడు కుంట పంచాయతీ వరకు సుమారు 16 కిలోమీటర్లు సాగిన టిడిపి బైక్‌ ర్యాలీలో పల్లె రఘునాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ టీడీపీదే అని అన్నారు. వైసీపీ ఆగడాలకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈసందర్భంగా తంగేడు కుంట పంచాయతీ మద్దకవారిపల్లిలో సుమారు165కుటుంబాలకు పైగా టిడిపిలో చేరాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, గుండుమల తిప్పేస్వామి, మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్ట ఓబుల్‌ రెడ్డి, జాకీర్‌, పీట్ల సుధాకర్‌, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, బూదిలి ఓబుల్‌ రెడ్డి, అంజనప్ప, ఆరీఫ్‌ఖాన్‌, షాను, మండ్యం చాంద్‌బాషా, షబ్బీర్‌, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️