పేదరికం లేని సమాజమే లక్ష్యం

Mar 12,2024 21:57

ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

                       ధర్మవరం టౌన్‌ : పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం జగనన్న కాలనీలలో వివిద లేఅవుట్లలో ఇంటి పట్టాలు పొందిన లబ్దిదారులకు ప్రభుత్వం ఉచితం చేయించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు టీడీపీ అల్లరి మూకల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న గీతాంజలికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్నారన్నారు. నేతన్నలు అధికంగా నివశించే ధర్మవరం లాంటి ప్రాంతంలో ఇప్పటికే జగనన్న కాలనీల ద్వారా 13, 356 ఇళ్లు, టిడ్కో అపార్ట్మెంట్ల ద్వారా 14,440 ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. పట్టణానికి అతి చేరువలో 1.50సెంట్ల స్థలంలో చేనేత కార్మికులకు ఇంటితో పాటు మగ్గంషెడ్‌ నిర్మించుకునేలా సాయం అందించడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలంతా సంపూర్ణంగా మద్దతు తెలిపి వైసిపిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాచర్ల లక్ష్మి, వైస్‌చైర్మన్లు వేముల జయరామిరెడ్డి, షంషాద్‌ బేగం, మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌ కుమార్‌, పట్టణాధ్యక్షులు కోటిరెడ్డి బాలిరెడ్డి, నీలూరి ప్రకాష్‌, సచివాలయాల కన్వీనర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్‌, కౌన్సిలర్లు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, పెనుజూరి నాగరాజు, జెసిబి రమణ, చింతా ఎల్లయ్య, కడప రంగస్వామి, బ్రహ్మయ్య, ఎస్పీ షకీల, వైసిపి వార్డు ఇన్‌ఛార్జులు కాచర్ల అంజి,చాంద్‌ బాషా, గడ్డం రంగా,ఉడుముల రాము, తొండ మాల రవి, గుద్దిటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️