భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలివ్వాలి

Feb 6,2024 21:43

నిరసన దీక్షలో పాల్గొన్న నాయకులు, భవన నిర్మాణరంగ కార్మికులు

                  ఓబుళదేవరచెరువు : మండల పరిధిలోని భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇళ్ల స్థలాల వెంటనే కేటాయించాలని సిఐటియు మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, కార్యదర్శి శ్రీరాములు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణరంగ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. వారి సమస్యలు పరిష్కరించేదాకా ఆందోళన ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిష్టప్ప, కేశవ, రమణ, సూరి, రవి, శ్రీనివాసులు, మహేష్‌, సురేంద్ర, చాంద్‌బాషా, కేశవ తదితరులు పాల్గొన్నారు.

➡️