మరోమారు వైసిపిని ఆశీర్వదించండి : ఎమ్మెల్యే

Jan 23,2024 22:09

 పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, తదితరులు

                          ఓబుళదేవరచెరువు :వచ్చే ఎన్నికల్లో మరోమారు వైసిపిని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కోరారు. పాదయాత్రలో భాగంగా 5వ రోజైన మంగళవారం ఎమ్మెల్యే మండల పరిధిలోని బాలప్పగారి పల్లి, తెల్లవారిపల్లి, అచ్చుమియపల్లి రోడ్డు, కాటంరెడ్డిపల్లి, కమ్మవారిపల్లి, నవాబుకోట, కొండకమర్ల మీదుగా ముందుకుసాగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎపిని అభివృద్ధి బాటలో నడిపిస్తు న్నారన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపడమే పాదయాత్ర ఉద్దేశ్య మన్నారు. పాదయాత్రలో ఎంపీపీ పర్వీన్‌బాను, జడ్పిటిసి కుర్లి దామోదర్‌ రెడ్డి, టౌన్‌ కన్వీనర్‌ కోళ్ల కృష్ణారెడ్డి, మండల కన్వీనర్‌ రాజు నాయుడు, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, షామీర్‌బాషా, రఫీక్‌, మజీద్‌, గోవిందు, భాస్కర్‌రెడ్డి, వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️