మహిళా పక్షపాతి వైసిపి : మంత్రి ఉషశ్రీ చరణ్‌

Mar 15,2024 22:08

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌

                    పెనుకొండ : వైసిపి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమనిరాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌ ఆవరణంలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నగదు జమ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించారని అన్నారు. అనంతరం వైయస్సార్‌ చేయూత మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

➡️