మాతా – శిశు మరణాలపై సమీక్ష

Dec 7,2023 21:18

 లబ్ధిదారురాలికి ఆటో అందజేస్తున్న కలెక్టర్‌

             పుట్టపర్తి రూరల్‌ : మాతా శిశు మరణాలపై స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అరుణ్‌బాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023 జులై నుండి సెప్టెంబర్‌ వరకు శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో జరిగిన మాతా – శిశు మరణాపై సమీక్షించారు. మాతా శిశు మరణాలు సంభవించిన సంబంధిత ప్రాథమిక ఆరోగ్యే కేంద్ర పరిధిలో పని చేస్తున్న వైద్యాధికారులు, ఎఎన్‌ఎంలు, ఆశా, అంగన్వాడి కార్య కర్తలు, మృతిచెందిన తల్లీ బిడ్డల కుటుంబ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.సమీక్షలో భాగంగా ఒక్కొక్క మరణానికి కారణాలను పరిస్థితులను విశ్లేషిస్తూ వాటిని నివారించగలిన విషయాలపై లోతుగా అధ్యయనం చేసి చర్చించారు. చర్చ సమయంలో వివరణ ఇవ్వలేక పోయిన వైద్య సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. గర్భిణి అని తెలిసినప్పటి నుంచి కాన్పు అయి, బిడ్డ వయస్సు 1 సం, పూర్తి అయ్యేవరకు అన్ని శాఖలు సమన్వయం చేసుకొని అన్ని రకాల సేవలు అందించాలని, ఐ ఈ వాక్సినేషన్‌, వైద్య పరీక్షలు ఐసిడిఎస్‌ ద్వారా సరైన పోషక ఆహరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు , ఐసిడిఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.పభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి పుట్టపర్తి అర్బన్‌ : మహిళా శక్తితోనే సాధికారిత సాధ్యమని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న ఉన్నతి మహిళా శక్తి ఆటో పథకాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే ఆటోలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఎంపికైన ఇద్దరు ఎస్సీ మహిళలు, నలుగురు ఎస్టీ మహిళలకు కలెక్టర్‌ ఆటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ఇన్‌ఛార్జి పీడీ రామ్మోహన్‌, ఎపిఎం లలిత, రామప్ప లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️