మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి

Jan 5,2024 21:59

పుట్టపర్తిలో మున్సిపల్‌ కార్మికుల పొర్లు దండాలు

                      పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ హెచ్చరించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం కొనసాగింది.ఈ సందర్భంగా కార్మికులు వినూత్న రీతిలో పొర్లు దండాలతో నిరసన తెలిపారు. అనంతరం ఈఎస్‌ వెంకటేష్‌, మున్సిపల్‌ కార్మికుల జిల్లా యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పారిశుధ్యం లోపించి ప్రజలు రోగాల బారిన పడినా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను మాత్రమే తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పైపల్లి గంగాధర్‌, రవాణా రంగం జిల్లా కార్యదర్శి పెడపల్లి బాబా, ఒడిసి మండల కార్యదర్శి రమణ, మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ నాయకులు పెద్దన్న, గోవిందు, నాగార్జున, నరసింహులు, సాయి, మారెక్క తదితరులు పాల్గొన్నారు.పెనుకొండ : పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు, కార్మికులు రోడ్డుపై పొర్లుదండాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరి సమ్మెకు బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, గౌరవాధ్యక్షులు వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ తదితరులు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ నగర పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సిపిఎం సభ్యులు తిప్పన్న, నగర పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు వెంకటేష్‌, చంద్ర కార్మికులు పాల్గొన్నారు. కదిరి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 11 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు పొర్లు దండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండు రోజులనుంచి సమ్మెలో ఉంటే, కార్మిక సమస్యలు పరిష్కరించకపోగా పోటీ కార్మికులతో పని చేయించడం అన్యాయమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని క్లాప్‌ డ్రైవర్లకు నూ. 18500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు జనార్ధన, రాజు, సూరి, చిన్నకృష్ణ, చంద్రప్పతోపాటు సిఐటియు నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్జాన్‌, తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి అయూబ్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 11వ రోజు కొనసాగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికసంఘం గౌరవసలహాదారులు పెదక్క, వెంకటేశులు, సెక్రటరీ చెన్నకేశవులు, కోశాధికారి లక్ష్మీఓబుళేశు, ఉపాధ్యక్షులు ప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీ ముకుంద, అవుట్‌సోర్సింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగపు ఉద్యోగ కార్మికసంఘం అధ్యక్షులు అడ్రామహేశ్‌, ప్రధానకార్యదర్శి బొగ్గునాగరాజు, సహాయకార్యదర్శి సాకే బాబు, కోశాధికారి అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు దాసరిసురేశ్‌, అంకే పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ్త

➡️