రాష్ట్రంలో ఆగిన అభివృద్ధి : పల్లె

Feb 11,2024 22:09

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

                         పుట్టపర్తి రూరల్‌ : వైసిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని పెడపల్లి గ్రామంలో వైసిపి నుంచి పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పల్లె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు పులివెందుల పార్థసారథి, సామకోటి ఆదినారాయణ, శ్రీరామ్‌ నాయక్‌, శ్రీరామిరెడ్డి పుల్లప్ప, జనసేన నాయకులు అబ్దుల్‌ పాల్గొని ప్రసంగించారు. ఎస్‌ఆర్సిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క చెరువుకు కూడా కూడా నీరు అందించిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా పెడపల్లి పంచాయతీ పరిధిలోని గువ్వలగుట్టపల్లి, బత్తలపల్లి, పెడపల్లి, పెడపల్లి తాండ, సుబ్బరాయనపల్లి, గ్రామాల కు చెందిన వైయస్సార్సీపి కి చెందిన పలువురు నాయకులు పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్‌ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన శివప్ప, రవి నాయక్‌, శంకర్‌ నాయక్‌, సప్లయర్‌ చంద్రారెడ్డి, సుబ్బరాయన పల్లి వడ్డీ వెంకటేష్‌, గువ్వల గుట్టపల్లి చెంగల శివయ్య, ఎర్రంపల్లి సుందరయ్య ,లక్ష్మన్న ,వెంకటేష్‌ గువ్వల రామచంద్ర, హరి, శ్రీనివాసులుతో పాటు పంచాయతీ వ్యాప్తంగా దాదాపు 100 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్లు పుట్టపర్తి రామాంజనేయులు, విజరు కుమార్‌ , కొత్తచెరువు వలిపి శ్రీనివాసులు, అమడగూరు గోపాల్‌ రెడ్డి ,ఓడిసి జయచంద్ర, అని తోపాటు మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు కొట్లపల్లి నారాయణస్వామి, నాగిరెడ్డి ,రామయ్య, తోపాటు మండలంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️