రాష్ట్రస్థాయి పోటీల్లో ధనాపురం విద్యార్థిని ప్రతిభ

Jan 2,2024 21:56

 అవార్డు అందుకుంటున్న విద్యార్థిని మంజుల

                   పరిగి : రాష్ట్రస్థాయి కేశల్‌ పోటీల్లో పరిగి మండలం ధనాపురం విద్యార్థిని మంజుల ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు శిక్షణ ఉపాధ్యాయురాలు సుకన్య వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ఎంపిక కౌశల్‌ పోస్టర్‌ పోటీల్లో పరిగి మండలం ధనాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని మంజుల పాల్గొనిందన్నారు. ఈ పోటీలను విజయవాడలో నిర్వహించగా మంజుల రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందినట్లు తెలిపారు. 2023 కి సంబంధించి కౌసల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం తో పాటు రూ 3 వేల రూపాయలు నగదును అందజేసినట్లు వివరించారు.

➡️