లబ్ధిదారులకు త్వరలో టిడ్కో ఇళ్ల పంపిణీ : ఎమ్మెల్యే

Feb 15,2024 21:21

టిడ్కో ఇళ్ల వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి, తదితరులు

                     ధర్మవరం టౌన్‌ : ప్రభుత్వంచే నిర్మించిన టిడ్కో ఇళ్లను అతి త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలి పారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం పట్టణంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. సౌక ర్యాలపై టిట్కో డిఇ, ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఇళ్ల నిర్మాణం 20 రోజుల లోపల పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌కుమార్‌, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు, టిడ్కో ఏజెన్సీ దారులు తదితరులు పాల్గొన్నారు.

➡️