విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Feb 29,2024 21:30

విద్యార్థులు తయారుచేసిన నమూనాలు పరిశీలిస్తున్న అధికారులు

                   ధర్మవరం టౌన్‌ : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సురేష్‌బాబు అన్నారు. పట్టణంలోని యశోద స్కూల్లో గురువారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్‌ నమూనాలను పాఠశాలలో ప్రదర్శనగా ఉంచారు. వీటిని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిప్‌ సురేష్‌బాబు, పాఠశాల డైరెక్టర్‌ ఫృథ్వీరాజ్‌, ప్రిన్సిపల్‌ అనూప్‌, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు. ప్రదర్శనలో ఉంచి ప్రయోగాలను పరిశీలించి ఉత్తమమైన వాటికి బహుమతులను అందజేశారు. కొత్తచెరువు : విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తి కనపరచాలని ప్రిన్సిపాల్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పద్మావతి తెలిపారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్‌ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన నవీన్‌కుమార్‌రెడ్డి, పద్మావతి మాట్లాడుతూ నిత్యజీవితంలో సైన్స్‌ ఆవశ్యకతను వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు విజ్ఞాన శాస్త్ర నమూనాలను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ హనుమంతు, ఏవో కేశవరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️