వైఎస్సార్‌ కళ్యాణమస్తు.. షాదీతోఫా అందజేత

లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

          పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు షాదీ తోఫా కింద అక్టోబర్‌, డిసెంబర్‌-2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న 416 మంది జంటలకు రూ.3.10 కోట్లు మంజూరు అయ్యిందని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి నగదును జమ చేశారు. ఇందుకు సంబంధించిన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ తుంగ ఓబుళపతి, వైస్‌ ఛైర్మన్‌ లక్ష్మీనారాయణ రెడ్డి, పుడా ఛైర్‌పర్సన్‌ లక్ష్మీనరసింహ, అగ్రిగోల్డ్‌ జిల్లా ఛైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్‌ పాల్గొన్నారు. లబ్ధి లబ్ధిదారులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం కలెక్టర్‌, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.

➡️