వైసిపి జట్టు సిద్ధం..!

      అనంతపురం ప్రతినిధి : వైసిపి అనేక విడతలుగా అభ్యర్థులు ప్రకటిస్తూ వచ్చింది. తాజాగా శనివారం విడుదల చేసిన జాబితాతో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించింది. అంతకు మునుపు వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఆఖరి జాబితాలో మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పాతవారితో కలిపి మొత్తం జాబితాను మరోమారు ప్రకటించింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరుపున బరిలో దిగే అభ్యర్థులెవరన్న లెక్కి తేలింది. ఆఖరు జాబితాలో ఎటువంటటి మార్పుల్లేకుండా సిట్టింగులకే చోటు కల్పించింది.

అసెంబ్లీ బరిలో నిలిచే వైసిపి అభ్యర్థలు వీరే

        ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో అన్ని స్థానాలకు వైసిపి అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి, గుంతకల్లుకు వై.వెంకటరామిరెడ్డి, తాడిపత్రికి పెద్దారెడ్డి, ఉరవకొండకు వై.విశ్వేశ్వరరెడ్డి, దర్మవరానికి కేతిరెడ్డి వెంకటరావమిరెడ్డి, రాప్తాడుకు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పుట్టపర్తికి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. వీరిలో విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జిగా ఉండగా, మిగిలిన వారంతా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక అంతకు మునుపు సమన్వయకర్తలుగా ప్రకటించిన శింగనమలకు వీరాంజినేయులు, కళ్యాణదుర్గంకు తలారి రంగయ్య, పెనుకొండ ఉషచరణ్‌ శ్రీ, హిందూపురం దీపిక, మడకశిర ఈరలక్కప్ప, కదిరి మక్బుల్‌ బాషాలను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక పార్లమెంటుకు స్థానాలకు సంబంధించి అనంతపురానికి శంకర నారాయణ, హిందూపురానికి శాంతమ్మ పేర్లు ప్రకటించారు.

వైసిపి తరుపున తేలిపోయిన అభ్యర్తులు

           వైసిపి సార్వత్రిక ఎన్నికలకు పూర్తి స్థాయి అభ్యర్థులు తెలారు. ఇన్ని రోజులు పోటీలో నిలిచేదెవరన్న దానిపై కొన్ని నియోజకవర్గాల్లో సస్పెన్స్‌ నడుస్తూ వచ్చింది. శనివారం నాడు అధిష్టానం అన్ని స్థానాలపై స్పష్టతను ఇచ్చేసింది. ప్రతిపక్ష టిడిపిలోనే ఇంకా రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. అనంతపురం అర్బన్‌, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులెవరన్నది ఇంకా ప్రకటించలేదు. అదే విధంగా పార్లమెంట్‌ అభ్యర్థులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నారు. వైసిపి మాత్రం ఎన్నికల షెడ్యుల్‌ వెలువడే సమయానికి అభ్యర్థులను ప్రకటించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యింది.

➡️