సమ్మెను ఆపం…

Dec 18,2023 22:01

ధర్మవరంలో నిర్వహించిన సమ్మెలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

                           తమ సమస్యలు పరిష్కరంచేదాకా సమ్మెను ఆపే ప్రసక్తే లేదని అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి ఏడవ రోజుకు చేరుకుంది. ఏడవరోజు సమ్మెలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్డీవో కార్యాలయాల ముందు అంగన్వాడీలు ఆందోళన చేశారు. కదిరి ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, ధర్మవరంలో జరిగిన సమ్మెలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళనలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, పెనుకొండలో నిర్వహించిన సమ్మెలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెడ్పి శ్రీనివాసులు, రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంగన్వాడీల ఆందోళనకు టిడిపి, జనసేన నాయకులు మద్దతు తెలిపారు.కదిరి అర్బన్‌ : ప్రజలకు పేద పిల్లలకు సేవలు అందిస్తున్న అంగన్వాడి కేంద్రాల తలుపులను బద్దలు కొట్టి పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షసత్వ పాలన కొనసాగుతున్న జగనన్న పాలనకు 90 రోజులు చరమగీతం పాడుదామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు అన్నారు. అంగన్వాడీల సమ్మెలో ఏడవ రోజు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో సిఐటియు నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈసందర్భంగా సిఐటియు నాయకులు ఓబులు, జిఎల్‌ నరసింహులు, బాబ్జాన్‌, జగన్మోహన్‌ అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మాబున్నీసా తదితరులు తమ డిమాండ్లతో కూడిన వినతిత్రాన్ని ఆర్డీవో వంశీకృష్ణకు అందజేశారు. ధర్మవరం టౌన్‌ : అంగన్వాడీలు వారం రోజులుగా తమ సమస్యలుపరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తుంటే సిఎం జగన్‌కు పట్టదా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన చేశారు. అనంతరం ఆర్డీవో రమేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, శ్రామిక మహిళా ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌, సిఐటియు మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆదినారాయణ, అయూబ్‌ ఖాన్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి నాగార్జున, సీనియర్‌ నాయకుడు ఎస్‌హెచ్‌ బాషా, రైతుసంఘం నాయకులు కొత్తపేట మారుతి, అంగన్వాడీ యూనియన్‌ ప్రధానకార్యదర్శి చంద్రకళ, అంగన్వాడీలు పోతక్క, దీనా, అరుణ, రత్నమ్మ, అనిత, కృష్ణవేణి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని సిఐటియు నాయకులు విమర్శించారు. సోమవారం ఆరవ రోజు పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు డివిజన్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహించారు. తొలుత గణేష్‌ కూడలి వద్ద నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు పొర్లుదండాలు పెట్టారు. అంగన్వాడి యూనియన్‌ నాయకురాలు రంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, లక్ష్మణ్‌. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిఐటియు నాయకులు బాబావలి, బాళ్ల అంజి పాల్గొన్నారు. వీరి ఆందోళనకు తెలుగుదేశం జనసేన నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ కొంతమంది వైసిపి ప్రజాప్రతినిధులు అంగన్వాడీల గురించి మాట్లాడుతూ ఒళ్లు బలిసి రోడ్లు ఎక్కారని విమర్శించడం శోచనీయమన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వైసిపికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు గ్రామస్థాయి నాయకులు ఒక పథకం ప్రకారం గ్రామాలలో రెచ్చగొడుతూ అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తెరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణం చర్చలు జరిపి అంగన్వాడీ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేసి అంగన్వాడీలు అంటే ఏమిటో ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జాయింట్‌ సెక్రెటరీ పవన్‌ హరి ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు నాగమణి, సుజాత, తెలుగుదేశం నాయకులు రత్నప్ప చౌదరి,, సర్పంచి శ్రీనివాసులు, జనసేన నాయకులు బొగ్గరం శ్రీనివాసులు, అబ్దుల్‌, డాక్టర్‌ తిరుపతేంద్ర, రాము, పూల శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పెనుకొండ : సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా 7వ రోజైన సోమవారం అంగన్వాడీలు పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వీరికి సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జడ్పీ శీన, రమేష్‌, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉష, జిల్లా కోశాధికారి శ్రీదేవి, వ్య.కా.సం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్‌, పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, నారాయణ, సిపిఎం మండల కమిటీ సభ్యులు తిప్పన్న, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి సంఘీభావం తెలిపారు. సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీక్షలో ఆశా వర్కర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు త్రివేణి, రాజేశ్వరి, ప్రాజెక్టు లీడర్లు బావమ్మ, జయమ్మ, సావిత్రమ్మ, మాబున్నీసా, జ్యోతి, లావణ్య, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ, సిఐటియు నాయకులు వెంకటేష్‌, రామచంద్ర, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️