సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యం

సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యం

సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మంత్రి జయరాం

          మడకశిర : సామాజిక న్యాయం వైసిపి అధినేత, సిఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరామ్‌ పేర్కొన్నారు. పట్టణంలో గురువారం వైసిపి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేయాల్సిన విధానమని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పారని, అందుకగుణంగానే కనీవిని ఎరుగని రీతిలో నవరత్నాలు పథకాలు అమలు చేశారన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేశారన్నారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయమే గడప దగ్గరే పింఛన్లు అందిస్తూ అవ్వ, తాతల మొహాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఎంపి నందిగాం సురేష్‌ మాట్లాడుతూ మంత్రివర్గంలో సామాజిక న్యాయాన్ని పాటించి దేశానికే చాటిన గొప్ప నాయకుడు జగన్‌ అన్నారు. ఎవరు మనకు ధైర్యాన్ని ఇస్తారో, మంచి చేస్తారో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి మాట్లాడుతూ సిఎం జగన్‌ నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు-నేడు ద్వారా కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేశారన్నారు. ఇంగ్లీషు మీడియంలో బోధనను ప్రవేశపెట్టి, అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో జగన్‌తో పోటీ పడే వారే లేరు, భవిష్యత్తులో రారన్నారు. టిడిపి పాలనలో ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడని, నమ్మితే నిండా మునిగినట్టే అని హెచ్చరించారు. బహిరంగ సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శంకరనారాయణ, ఎంపిలు గోరంట్ల మాధవ్‌, నందిగాం సురేష్‌, ఎమ్మెల్సీ మంగమ్మ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ఒక్కలిగ కార్పొరేషన్‌ ఛైర్మన్లు పొగాకు రామచంద్ర, నలిని రంగేగౌడ్‌, హిందూపురం సమన్వయకర్త దీపిక, వైసిపి ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మంత్రి జయరామ్‌కు ఘనస్వాగతం

నియోజకవర్గంలో నిర్వహించే ‘సామాజిక సాధికార బస్సుయాత్ర’లో పాల్గొనడానికి మడకశిరకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం, వైసిపి జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, జడ్పి ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు అశోక్‌కుమార్‌, హిందూపురం ఇన్‌ఛార్జి దీపికవేణురెడ్డి, తదితరులను హరే సముద్రం న్యాయవాది కె.అశ్వర్థనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలు ఇచ్చి స్వాగతం ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు రాష్ట్ర కుంచితి వక్కలిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ నలిని రంగేగౌడ్‌, గుడిబండ, అమరాపురం జడ్పిటిసి సభ్యులు బిఎన్‌.భూతరాజు, సారక్క నరసింహమూర్తి, గౌడనహళ్లి మాజీ సర్పంచి శివశంకర్‌, బి.ఎర్రహనుమప్ప, బి.నరసింహమూర్తి, జిఎన్‌.పాలెం శివానంద, తదితరులు ఉన్నారు.

➡️