ఉరి తాళ్ళకు వేలాడుతూ వినూత్న నిరసన

Dec 20,2023 15:00 #Sri Satya Sai District
బత్తలపల్లి మండల కేంద్రంమంలో తాసిల్దార్ కార్యాలయం ముందు 9వరోజు చేరుకుంది నాలుగు రోడ్ల కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ వచ్చే బిక్షాటన చేసారు

ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సద్భావన సర్కిల్లో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తొమ్మిదవ రోజు సమ్మె బయట పట్టారు. నిరసన చేస్తున్న చోటే మహిళలు మోకాళ్ళపై నిల్చుని ఉరి తాళ్ళకు వేలాడుతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. బటన్ నొక్కు జీతాలు పెంచు అంటూ, జీతాలు పెంచనిపక్షంలో రాజీనామా చెయ్, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని సీఎం ఎందుకంటు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మీకు సరైన బుద్ధి చెబుతామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడి ఉద్యోగులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. అంగన్వాడి ఉద్యోగులు వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కనీసం పనికి తగ్గ వేతనాలు పెంచాలని పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. వేతనాలు పెంచి పదవీ విరమణ పొందిన వారికి పింఛన్ మంజూరు చేయాలని ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయాలని ఆదేశించడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అంగన్వాడీల ఆందోళనకు తెలుగు నాడు కార్మిక సంఘం నాయకులు మద్దతు పలికారు. అదేవిధంగా మెడికల్ రెప్స్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం మద్దతు తెలిపి వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, స్థానిక నాయకులు లావణ్య, శిరీష, శైలజ, టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పరిమళ, కౌన్సిలర్లు మంజుళ, మహాలక్ష్మి, భారతి తో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️