ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు

          హిందూపురం : పట్టణంలో బుధవారం ఉదయం ‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, తహశీల్దార్‌ శివ ప్రసాద్‌ రెడ్డి, సెరికల్చర్‌ ఎడి సురేష్‌, ఎంఇఒ గంగప్ప, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ రెడ్డి శేఖర్‌ పాల్గొన్నారు.

➡️