వంటగ్యాస్‌ ఇకెవైసికి బారులుదీరిన జనం

Jun 14,2024 21:40

గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం వద్ద వరుసలో నిల్చొన్న మహిళలు

                  పుట్టపర్తి క్రైమ్‌ : తమ వంటగ్యాస్‌ కనెక్షన్‌ను ఇకెవైసి చేయించుకొంటేనే ప్రభుత్వ రాయితీలు అందుతాయని ప్రచారం కావడంతో వినియోగదారులు పుట్టపర్తి గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. విపరీతమైన రద్దీతో ప్రశాంతి గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు సతమతమవుతున్నారు. రోజుకు 100 టోకెన్లు ఇస్తున్నారు. సర్వర్లు పనిచేయకపోవడం కూడా ఆలస్యం అవుతోంది. ప్రతి రోజూ మహిళలు వందల కొద్ది తెల్లవారుజామునే బారులు దీరుతున్నారు. మొదట గ్రామాల వారిగా నమోదు చేయాలన్న గ్యాస్‌ నిర్వాహకుల నిర్ణయం పనిచేయలేదు. దీంతో టోకెన్‌ సిస్టం అమలు చేస్తున్నారు. పలువురికి టోకెన్లు అందక నిరాశతో వెను తిరుగుతున్నారు. చంద్రబాబు మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న నేపథ్యంలో గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం వద్ద రద్దీకి ఒక కారణమని తెలుస్తోంది. మరోవైపు కేంద్రం కూడా రాయితీలు ఇస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రశాంతి గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు పివి. రాజీవ్‌ మాట్లాడుతూ ఇకెవైసి చేయించుకోవడానికి నిర్ణీత గడువంటూ లేదని వినియోగదారులు సహకరిస్తే అందరికీ నమోదు చేయిస్తామని అన్నారు. రెండు నెలల లోపు నమోదు కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు.

➡️