క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించండి

Jun 13,2024 21:17

 సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ

                  హిందూపురం : క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పిచ్చిన వారమవుతామని జిల్లావైద్యాధికారి డాక్టర్‌ మంజువాణి అన్నారు. గురువారం హిందూపురం జిల్లా స్థాయి ఆసుపత్రిలో వైద్యాధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్‌ మంజువాణి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌.లింగన్న, జిల్లా ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ కెసికె.నాయక్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతు మారుతున్న ప్రజల జీవనశైలి వల్ల రోజు రోజుకూ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల పెరుగుతోందన్నారు. లక్షణాలు లేని క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తులను గుర్చించడమే ఈ శిక్షణ కార్యక్రమ ముఖ్య ఉద్దేశన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు, గ్రామాలలో అనునిత్యం పర్యటించే ఆరోగ్య కార్యకర్తలు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాపక్రింద నీరులా పాకుతున్న క్యాన్సర్‌ వ్యాధిని మొక్కదశలోనే తుడిచిపెట్టి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్యులు పద్మజ, విజయబాబు, ఆయీషా తదితరులతో పాటు వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : క్యాన్సర్‌ పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని డిప్యూటి డైరెక్టర్‌ డాక్టర్‌ శివశంకర్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో గురువారం మండలంలోని మెడికల్‌ ఆఫీసర్లకు, సిహెచ్‌ఒ, ఎఎన్‌ఎంలకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివశంకర్‌ మాట్లాడతూ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సెల్వియా సాల్మాన్‌ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా క్యాన్సర్‌లోని రకాలను వివరించారు. క్యాన్సర్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నివేదిత, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవి, డాక్టర్లు శైలజ, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

➡️