పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎండిఎస్‌ బ్రదర్స్‌

         హిందూపురం : నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యులుగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన సందర్భంగా ఎండిఎస్‌ బ్రదర్స్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ సారథ్యంలో హిందూపురం పట్టణంతోపాటు నియోజకవర్గం అన్ని విధాల అభివద్ధి చెందుతుందన్నారు. హ్యాట్రిక్‌ సాధించిన బాలకష్ణకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాబ్‌, హిదాయతుల్లా, ఇందాద్‌ పాల్గొన్నారు.

➡️