ఎన్నికల నిబంధనలు పాటించాలి : జేసీ

Apr 15,2024 22:22

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

                  హిందూపురం : నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ సూచించారు. సోమవారం స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పట్టణానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, 25న ముగుస్తుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను ముందుగానే పరిశీలించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు తమ బీ ఫారాలను నామినేషన్‌ తో పాటు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్‌ శివ ప్రసాద్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️