విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్‌ పరిశీలన

May 24,2024 21:43

రిజిస్ట్రేషన్‌ను పరిశీలిస్తున్న ఎడిఎ

                   ముదిగుబ్బ : మండలంలోని జొన్నల కొత్తపల్లి, సంకేపల్లి గ్రామాలలోని రైతుభరోసా కేంద్రాల్లో జరుగుతున్న వేరుశనగ విత్తన రిజిస్ట్రేషన్‌ పక్రియను కదిరి వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. కె-6, కదిరి – 1812(వేమన), టి సి జి యస్‌ 1694 (వశిష్ట )వేరుశనగ రకాలు అందుబాటులో ఉన్నాయని ఈసందర్బంగా ఆయన చెప్పారు. ప్రభుత్వ విత్తన కాయలను దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి లక్ష్మి నరసింహులు, ఎఇఒ షరీఫ్‌, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

➡️