చంద్రబాబుతోనే రాష్ట్ర్రాభివృద్ధి : పల్లె

Apr 13,2024 22:13

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

కొత్తచెరువు : చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, టిడిపి పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి సింధూర రెడ్డి అన్నారు. పుట్టపర్తికి చెందిన రామ్‌ లక్ష్మణులు తమ మద్దతుదారులతో కలసి వైసీపీ నుండి టిడిపిలోకి శనివారం చేరారు. ఈసందర్భంగా కర్నాటక నాగేపల్లి బుక్కపట్నం మీదుగా కొత్తచెరువు వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు పూర్తిగా విసుగు చెందారన్నారు. టిడిపి రూపొందించిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పల్లెకృష్ణ కిషోర్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ శ్రీనివాసులు,జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ,మాజీ సర్పంచ్‌ మాణిక్యం బాబా, మండల కన్వీనర్‌ రామకృష్ణ, వలిపి శ్రీనివాసులు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పత్తి చంద్రశేఖర్‌, టిడిపి నాయకులు గాజుల చంద్రమోహన్‌, బోయ రాజు, రామాంజనేయులు, వైవి మురళి, రిటైర్డ్‌ టీచర్‌ నాగేందర్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

భారీ బైక్‌ర్యాలీ

               పుట్టపర్తి క్రైమ్‌ : పట్టణంలో యూత్‌ నాయకులు రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో 5వేల మంది వైసిపి పార్టీ నుంచి టిడిపిలో శనివారం చేరారు. ఈ సందర్భంగా 3వేల ద్విచక్రవాహనాలు, వెయ్యి ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు గోకులం ఇన్‌చార్జ్‌ భూమిగాని రాజశేఖర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో అలాగే 13వ వార్డు కోవెలగుట్టపల్లి టిడిపి మాజీ కౌన్సిలర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి నుంచి ప్రారంభమై జానకంపల్లి, బుక్కపట్నం, కొత్తచెరువు, మామిళ్ళకుంట క్రాస్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి, గోకులం మీదుగా మూడు మండలాలు కలుపుతూ దాదాపు 20 కిలోమీటర్లు తిరిగి పుట్టపర్తి లోని సత్యమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో రామ్‌ లక్ష్మణ్‌లు తన అనుచరులు, అభిమానులతో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో కన్పించని అభివృద్ధి : పల్లె ఓబుళదేవర చెరువు : వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి విమర్శించారు. మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామపంచాయతీ వైసీపీ సర్పంచి వేలమద్ది శ్రీదేవి ,రవీంద్రనాయుడు సమక్షంలో వైసీపీకి చెందిన వాలంటీర్లు తోపాటు 150 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో ఎంతో మేలు చేకూరుతుందని భావించామన్నారు. అలాగే పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని భావించి టిడిపిలోకి చేరినట్లు సర్పంచి శ్రీదేవి, వైసీపీ నేత రవీందర్‌ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. టిడిపిలో చేరిన వారిలో లక్ష్మీనరసింనాయుడు, సుధాకర్‌ నాయుడు, బుట్టి రాము ,మనోరంజని, వేలమద్ది చిన్న రంగప్ప ,రాజప్ప, ఎర్రమనేని చంద్ర, బీరేఅశోక్‌, ఎర్రమనేని చంద్రమౌళి, ఉషారాణి ,సాంబమూర్తి, నారే వెంకటేశు, నారే శివశంకర్‌ , యర్రమనేని శంకర, ఎర్రమనేని సురేష్‌ ,ఈశ్వరయ్య ,నాగముని ,నాగమునిమ్మ జయమ్మ ,శాంతమ్మ రాజేంద్ర, బాబు, పటాన్‌ మహబూబ్‌ బాషా తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి కన్వీనర్‌ జయచంద్ర , మాజీ జడ్పిటిసి పిట్ట ఓబుల్‌ రెడ్డి, మహబూబ్‌ భాష, ఎంపీటీసీ శ్రీనివాసులు, సర్పంచి శంకర్‌ రెడ్డి, రేణుక భారు, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌, , ఆరిఫ్‌ ఖాన్‌, చాంద్‌ భాషా, షబ్బీర్‌ జాకీర్‌ అహ్మద్‌, ఇర్షాద్‌ షాను ,నిజాం, ఓబుల్‌ రెడ్డి, బోయపల్లి శివారెడ్డి, అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.పల్లె ఆధ్వర్యంలో టిడిపిలో పలువురు చేరిక కొత్తచెరువు రూరల్‌: కొత్తచెరువు మండల పరిధిలోని పోతులకుంట గ్రామానికి చెందిన పలువురు పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ వలిపి శ్రీనివాసులు వారికి కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎవ్వరికైనా సముచిత న్యాయం లభిస్తుందని అన్నారు.

➡️