జగన్‌ మేనిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌ : కందికుంట

Apr 30,2024 22:42

పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్‌

                      కదిరి టౌన్‌ : వైసిపి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో అట్టర్‌ఫ్లాప్‌ అని కదిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ వర్గంలోని నల్లచెరువు మండలంలోని 50 వైసిపి కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. పూలకుంటలోని ఆ పార్టీకి చెందిన నాగభూషణం ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి వారందరికీ కందికుంట వెంకటప్రసాద్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా టిడిపిలోకి ఆహ్వానించారు. అనంతరం కందికుంట వెంకటప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ నియోజవర్గ వ్యాప్తంగా కులాలు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున టిడిపికి మద్దతు తెలుపుతున్నారన్నారు. జగన్‌ అరాచకాలపై విసిగిపోయిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వలస బాట పడుతున్నారని వారందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. టిడిపి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లో సూపర్‌గా హిట్‌గా నిలిచాయన్నారు. కదిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుపై అన్ని రకాలైన ఆశలు వదులుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆదరించండి.. రుణపడి ఉంటా… మైనార్టీలకు అండగా నిలబడేది టిడిపినే అని కదిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. మంగళవారం కదిరి పట్టణంలోని దరుస్సలం ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కదిరి డివిజన్‌ భారత్‌ కార్పెంటర్స్‌ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కందికుంట మాట్లాడుతూ నియోజవర్గానికి ఏం చేయాలో స్వయంగా చంద్రబాబుతోనే చెప్పించానని అన్నారు. కార్మికులు, చేతివత్తులు ఎవరైతే ఉన్నారో వారికి వేదికను ఏర్పాటు చేసి పని కల్పిస్తామన్నారు. కులం ,మతం పేరు చెప్పి ఓట్లు అడిగితే గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పివి పవన్‌ కుమార్‌ రెడ్డి, కౌన్సిలర్లు ఆల్ఫా ముస్తఫా,మహబూబ్‌ బాషా,బహువుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️