బాల్య వివాహాలను నిర్మూలిద్దాం : ఆర్డీవో

Jun 14,2024 21:37

పోస్టర్లు విడుదల చేస్తున్న అధికారులు

                  కదిరి టౌన్‌ : కదిరి రెవెన్యూ డివిజన్‌ను బాల్య వివాహాల రహిత రెవెన్యూ డివిజన్‌గా మారుద్దామని ఆర్డీవో వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్‌ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక చట్టం, లైంగిక దాడుల నిరోధక చట్టాలపై మండల, గ్రామస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకులు లక్ష్మీ కుమారి, ఆర్డీవో వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీలత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామస్థాయిలో బాల్యవివాహాల మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి అధికారి బాల్య వివాహాలు, బాలల చట్టాల పైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు నిలుపుదల చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపిఒ మహేష్‌, రెవెన్యూ డివిజన్లోని తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎంఇఒలు, ఎస్‌ఐలు, ఐసిడిఎస్‌ అధికారులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

➡️