కదిరి అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం : ఎమ్మెల్యే

Jun 13,2024 21:15

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

                కదిరి టౌన్‌ : కూటమి తరపున ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై కదిరి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఎన్నికల పర్వంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై కూటమి తరపున కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తన గెలుపునకు పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందామనానరు. ఈనెల 16 న కదిరి సమీపాన గల పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఈ సమావేశానికి కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్‌ ఇర్ఫాన్‌, గంగయ్య నాయుడు, రాజశేఖర్‌ బాబు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️