పతి గెలుపునకు సతి ప్రచారం

May 3,2024 21:53

 పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్న వసుంధర దేవి

                       హిందూపురం : టిడిపి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ గెలుపునకు ఆయన భార్య వసుంధర ముమ్మర ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని టీచర్స్‌ కాలోని, సడ్లపల్లి తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వసుంధర మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి ఈ ప్రాంత ప్రజలు టిడిపిని ఆదరిస్తున్నారన్నారు. ప్రజాసేవ చేయడానికి స్ధానికుడే అవసరం కాదని సమస్యలను తీర్చగల వ్యక్తి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

➡️