సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

May 24,2024 21:41

 గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది

                              పుట్టపర్తి రూరల్‌ : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రశాంతి గ్రామం సమీపంలో సీజనల్‌ వ్యాధులు ,అడల్ట్‌ బిసిజి వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వ్యాక్సిన్‌తోక్షయ వ్యాధి నిర్మూలించవచ్చునని తెలిపారు. ప్రజలు ఆరోగ్య వంతమైన జీవనం సాగించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తి గత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పారు. డ్రైడే ఫ్రైడే పాటించి జ్వరాల బారిన పడకుండ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి నగేష్‌, సబ్‌ యూనిట్‌ అధికారి రమణయ్య, సూపర్‌వైజర్‌ వెంకటరమణ, ఎస్‌టిఎస్‌ అబీద్‌, ఆరోగ్య కార్యకర్త అమృత, ఆశా కార్యకర్త అనిత తదితరులు పాల్గొన్నారు.

➡️