సామాజిక సేవకులకు సేవా పురస్కారాలు

Jun 13,2024 21:16

సామాజిక సేవకులను సన్మానిస్తున్న నాయకులు

                    హిందూపురం : సామాజిక సేవకులకు విద్యా ప్రదాత సేవా పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ముస్లిం నగారా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. అఖిల భారత షహీద్‌ టిప్పు సుల్తాన్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షులు ఉమర్‌ ఫారూక్‌ ఆధ్వర్యంలో సత్య సాయి జిల్లా రచయితల సంఘం పట్టణ అధ్యక్షుడు కల్లూరు రాఘవేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో కోవిడ్‌ బాధితులను అన్ని విధాల ఆదుకోవడంతో పాటు విద్యార్థులను చైతన్యం చేస్తూ వారికి సహాయ సహకారాలు అందించిన సిఎంఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ మల్లికార్జున, చాంద్‌బాషాలకు అఖిల భారత షహీద్‌ టిప్పు సుల్తాన్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ తరపున ఈ పురస్కారాలను అందజేశారు. అనంతరం వారిని సన్మానించారు. ప్రతి ఒక్కరు సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉబేదుల్లా హుసేన్‌, లైఫ్‌ వరల్డ్‌ ఉదరు కుమార్‌, అబ్దుల్‌ సలామ్‌, మౌలానా రిజా ఉద్‌ రహమాన్‌, మౌలానా సాజిద్‌, ఆర్‌ఎంఎస్‌ షఫీ, షబ్బీర్‌, ముస్తఫా ఖాన్‌, అల్‌ అమీన్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️