వైసిపి హయాంలో కన్పించని అభివృద్ధి : టిడిపి

May 5,2024 21:37

 పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్‌   

                   ఓబుళదేవరచెరువు : వైసిపి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కన్పించలేదని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని సున్నంపల్లి పంచాయతీలోని పెద్దగుట్లపల్లి చౌడేపల్లి, మహమ్మదాబాద్‌ క్రాస్‌, తదితర గ్రామాలలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరిగి టిడిపి అధికారంలో వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయచంద్ర,ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌, బోయపల్లి శివారెడ్డి, మండోజీ ఆరిఫ్‌ ఖాన్‌, అంజినప్ప, షాను, నాగేంద్ర, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తనకల్లు : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు మద్దతుగా ఆపార్టీ స్థానిక నాయకులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి అధికారంలోకి వస్తే చేకూరే లబ్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రెడ్డి శేఖర్‌ రెడ్డి, శంకర్‌ నాయుడు, రాజారెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి, కుంచె నాగేంద్ర ప్రసాద్‌, కావడి ప్రవీణ్‌ కుమార్‌, మహబూబ్‌ బాషా సోంపాలెం నాగభూషణ, ఆనంద రెడ్డి, తోట సరోజమ్మ, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

గాండ్లపెంట : కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్‌ కార్యకర్తలతో మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని గాండ్లపెంట, తెలుగుట్టువారిపల్లి, జీనులకుంట, కోట్లపల్లి, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ టిడిపితోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సి. కొండయ్య, అప్పిరెడ్డి వెంకటరమణారెడ్డి, శివప్ప నాయుడు, డి గంగరాజు తదితరులు పాల్గొన్నారు

పుట్టపర్తి క్రైమ్‌ : ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తి రూరల్‌ మండల పరిధిలోని బొంతలపల్లి పంచాయతీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు ఆ గ్రామంలోని టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లె సింధూర్డ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే టిడిపి ధ్యేయమని పేర్కొన్నారు. ఈసందర్భంగా బోంతల పల్లి పంచాయతీలో సుమారు 20 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి సమక్షంలో టిడిపిలోకి చేరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కదిరి టౌన్‌ : నల్లచెరువు మండలంలోని వైసిపికి చెందిన వైస్‌ ఎంపీపీ నారాయణస్వామితో పాటు పంతుల చెరువు మాజీ సర్పంచి కిష్టప్ప తదితరులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నల్లచెరువు మండలంలోని తెల్లగుట్లపల్లి, పంతులచెరువు, ఇందుకూరుపల్లి, గ్రామాలకు చెందిన 80 వైసీపీ కుటుంబాలు ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది కుంట సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కందికుంట వెంకటప్రసాద్‌ పార్టీ కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో సొంత పార్టీ నాయకులతోపాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని గ్రహించి టిడిపిలోకి చేరుతున్నారని వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

➡️