అంగన్వాడీలపై కక్ష కట్టిన ప్రభుత్వం

అంగన్వాడీలపై వైసిపి ప్రభుత్వం కక్ష

కూన రవికుమార్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

అంగన్వాడీలపై వైసిపి ప్రభుత్వం కక్ష కట్టిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం తక్కువ బడ్జెట్‌ ఉన్న సమయంలోనూ టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.4,200 ఉన్న అంగన్వాడీల జీతాన్ని రూ.10,500కు పెంచినట్లు తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకొచ్చిన జగన్‌ కేవలం రూ.వెయ్యి పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. తెలంగాణలో అంగన్వాడీల జీతం రూ.13,650 కాగా, మన రాష్ట్రంలో రూ.11,500 ఉందన్నారు. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెంచకపోగా, సంక్షేమ పథకాలకు అంగన్వాడీలను దూరం చేశారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతో అంగన్వాడీలను వేధిస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో అంగన్వాడీల సమస్యలను జగన్‌ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. అంగన్వాడీలను పోలీసు లారీలతో చితకబాదించిన సంఘటనలు ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో మనోవికాస కేంద్రాలుగా పనిచేసిన అంగన్వాడీ కేంద్రాలు, జగన్‌ అసమర్థ పాలనలో సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయన్నారు.

 

➡️