అంగన్వాడీల పోరుబాట

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం

కొత్తూరు : ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

  • నిరవధిక సమ్మెతో మూతపడిన కేంద్రాలు
  • ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నా
  • సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం
  • స్పష్టం చేసిన అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌

* సమ్మెకు కార్మిక, ప్రజా, ఉద్యోగ సంఘాలు, టిడిపి, సిపిఎం మద్దతు

ప్రజాశక్తి – శ్రీకాకుళం యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు ఆధ్వర్యాన అంగన్వాడీలు పోరుబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా 2,704 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 2,624 మంది హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లోని 585 మంది కార్యకర్తలు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో జిల్లాలోని 6,180 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. సమ్మెలో భాగంగా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమ్మెకు పలు కార్మిక, ప్రజా, ఉద్యోగసంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ, సిపిఎం మద్దతు తెలిపాయి.సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెసమస్యలు పరిష్కరించే వరకు నిరధిక సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.అమ్మన్నాయుడు పి.తేజేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరించడం వల్లే సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వేతనాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెర్చవేర్చలేదని విమర్శించారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా, రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రిటైర్డ్‌ అయిన సందర్భంలో నామినల్‌ మొత్తం ఇవ్వడం వల్ల ఒంటరి మహిళలు, కుటుంబ ఆదరణ లేని వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలు సర్వీసులో చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయడం లేదని చెప్పారు. సమస్యలపై అంగన్వాడీలు దశల వారీగా అనేక ఆందోళనలు చేపట్టారని, అధికారులతో చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. మినీ సెంటర్లను తక్షణమే మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.ఐదు లక్షలకు పెంచాలని, పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. శ్రీకాకుళం నగరంలోని సిడిపిఒ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, ఐద్వా జిల్లా నాయకులు ఎ.లక్ష్మి, శ్రీదేవి పాణిగ్రాహి, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఎం.గోవర్థనరావు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి తదితరులు సందర్శించి సమ్మెకు మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు ఎం.వెంకటేష్‌, టి.వెంకన్న యాదవ్‌ తదితరులు సమ్మె శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అర్బన్‌ ప్రాజెక్టు నాయకులు కె.ప్రమీల, టి.రాజేశ్వరి, బి.సరస్వతిదేవి తదితరులు పాల్గొన్నారు.గార ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు జల్లు కాంచన, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, సిఐటియు నాయకులు ఎ.మహాలక్ష్మి తదితరులు సంఘీభావం తెలిపారు. ఆమదాలవలసలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె శిబిరాన్ని సిఐటియు సీనియర్‌ నాయకులు భవిరి కృష్ణమూర్తి ప్రారంభించారు. పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్థనరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.నరసన్నపేటలోని ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా నాయకులు కె.నాగమణి ప్రారంభించారు. ఎచ్చెర్ల ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని సిఐటియు నాయకులు ఎన్‌.వి రమణ ప్రారంభించారు.రణస్థలంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.సుజాత, బి.అప్పమ్మ తదితరులు పాల్గొన్నారు.కొత్తూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రజని, కె.లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు.పలాస ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కన్వీనర్‌ సునీత, ఆర్‌.అప్పలనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.టెక్కలి ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నంబూరు షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆర్‌.ఆదిలక్ష్మి, బి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.పొందూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, మండల అధ్యక్షులు బి.జ్యోతిలక్ష్మి, అంగన్వాడీ యూనియన్‌ సెక్టార్‌ నాయకులు కె.నాగరత్నం, కె.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.లకీëనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమావతి, విజయలక్ష్మి, బాలమణి తదితరులు పాల్గొన్నారు.బూర్జ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం తహశీల్దార్‌ రమణారావుకు వినతిపత్రం అందజేశారు. సమ్మెకు విఆర్‌ఎల సంఘ అధ్యక్షులు త్రినాథ్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్యనారాయణ, మండల అధ్యక్షులు రాజు, రాజారావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జ్యోతి, రాధిక, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారుకోటబొమ్మాళి ప్రాజెక్టు కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.సుధ, సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️