అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కిలోమీటర్ల మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని అన్నారు. వీటిలో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్‌ టీములు పర్యవేక్షణ ఉందని అన్నారు. శనివారం మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌, గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సిఎస్‌ వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. సమావేశంలో ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, జెసి నవీన్‌, అదనపు ఎస్‌పి ప్రేమకాజల్‌, సహాయక కలెక్టర్‌ రాఘవేంద్రమీనా, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, డిపిఒ వెంకటేశ్వర్లు, జిల్లా గృహనిర్మాణ పీడీ గణపతిరావు, డిఎంహెచ్‌ఒ మీనాక్షి, జిల్లా వ్యవసాయశాఖాధికారి కె.శ్రీధర్‌, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వాసుదేవరావు పాల్గొన్నారు.

 

➡️