అంధుల ఆరాధ్యుడు బ్రెయిలీ

చూపు కోల్పోయినంత మాత్రాన మనోధైర్యం కోల్పోకుండా

బ్రెయిలీ చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

చూపు కోల్పోయినంత మాత్రాన మనోధైర్యం కోల్పోకుండా అంధులు చదువుకునేందుకు వీలుగా లూయిస్‌ బ్రెయిలీ లిపిని కనుగొన్నారని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ డి.వి.వి.విద్యాసాగర్‌ అన్నారు. వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యాన డిఆర్‌డిఎ సమావేశ మందరింలో బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధుల పాలిట ఆరాధ్యుడు బ్రెయిలీ అని అన్నారు. బ్రెయిలీ లిపి వల్ల చదువుకునే అవకాశం అంధులకు లభించిందన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ ఎం.కిరణ్‌ కుమార్‌, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి కె.కవిత, జిల్లా ఉపాది కల్పనాధికారి కొత్తలంక సుధ, సిపిఒ ఎల్‌.ప్రసన్న పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంధులు పలు చిత్ర గీతాలను ఆలపించి అందర్ని ఆకట్టుకున్నారు. అనంతరం అందులకోసం ముద్రించిన వార్షిక కేలండర్‌ను ఆవిష్కరించారు. అంధుల సంఘం ఆధ్వర్యాన…లూయిస్‌ బ్రెయిలీ అంధుల లిపిని 12 నుంచి 6 చుక్కలకి కుదించి అంధుల పాలిట ఆరాధ్యుడయ్యాడని జిల్లా అంధుల సంక్షేమ సంఘం కార్యదర్శి అల్లు రమ అన్నారు. లూయిస్‌ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా హైటెక్‌ పారడైజ్లోని బొడ్డు శ్రీనివాసరావు స్వగృహంలో జయంతి వేడుకలను నిర్వహించారు. బ్రెయిలీ విద్యార్థిగా ఉన్నప్పుడే అంధులు త్వరగా, సమర్ధవంతంగా చదవడానికి, రాయడానికి అనుమతించే స్పర్శ కోడ్‌ వ్యవస్థను అభివృద్ధి చేశారని అన్నారు. స్పర్శ కోడ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో ప్రస్తుతం అంధులు ఉన్నతి స్థితిలో ఉండడానికి ముఖ్య కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు, పి.జగ్గారావు, సిహెచ్‌.రాంబాబు, పి.రామప్రసాద్‌, బొడ్డు లక్ష్మి, పి.శారద, గౌతం కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : అంతర్జాతీయ లూయిస్‌ బ్రెయిలీ జయంతి సందర్భంగా భవిత కేంద్రంలో ముత్యాలమ్మపేట స్కూల్‌లో ఎంఇఒ కె.అప్పారావు ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం టి.శివకుమార్‌, ఉదరు, పావని, ఎస్‌.సూర్యం, హెచ్‌.సోమేష్‌, అరుణ పాల్గొన్నారు. టెక్కలి : వికలాంగులను ఆదరించాలని ఎంఇఒలు డి.తులసీరావురెడ్డి, ఎస్‌.చిన్నారావులు కోరారు. స్థానిక భవిత కేంద్రంలో అంధుల లిపి నిర్మాత లూయీ బ్రెయిల్‌ జయంతి వేడుక నిర్వహించారు. ముందుగా బ్రెయిల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో భవిత కేంద్ర నిర్వాహక కో-ఆర్డినేటర్లు అట్టాడ మన్మథరావు, ఎం.సింహాచలం పాల్గొన్నారు. సంతబొమ్మాళి: స్థానిక భవిత కేంద్రంలో లూయి బ్రెయిలీ చిత్రపటానికి ఎంఇఒలు జె.చిన్నవాడు, అర్జునుడు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో స్థానిక లైబ్రేరియన్‌ రామకృష్ణ, భవిత ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్టు పాల్గొన్నారు.

➡️