అగ్రిగోల్డ్‌ బాధితుల సత్యాగ్రహ దీక్ష

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన అగ్రిగోల్డ్‌ సంస్థ బాధితులు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఎవరైతే తమకు న్యాయం

దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు

ప్రజాశక్తి – టెక్కలి రూరల్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన అగ్రిగోల్డ్‌ సంస్థ బాధితులు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఎవరైతే తమకు న్యాయం చేస్తారో వారికే తమ ఓట్లు అని నినాదాలు చేశారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.వి నాయడు మాట్లాడుతూ ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు ప్రతి జిల్లాలో రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. దీక్షకు సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.జయసింహ, జిల్లా కార్యదర్శి పైడి గోవిందరావు, బి.నారాయణరావు, జి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️