అసమ్మతి నేతపై పార్టీ ఉపేక్ష ఎందుకో?

నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు

మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

  • శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అసమ్మతి నేత సువ్వారి గాంధీపై అధిష్టానం ఎందుకు ఉపేక్షిస్తున్నదో అర్ధం కావడం లేదని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని మార్కెట్‌ కమిటీ యార్డులో నియోజకవర్గంలోని నాలుగు మండలా లు, మున్సిపాలిటీ పరిధిలోని వైసిపి నాయకులతో, కార్యకర్తతో ఈ నెల 27న సిఎం జగన్‌ భీమిలి సభ విజయవంతానికి బుధవారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పాటికే అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేని అన్నారు. పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నానని అన్నారు. మండలానికి పది బస్సులు చొప్పున నాలుగు మండలాలు, మున్సిపాలి టీకి కలిపి 50 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్రామాల్లోని వైసిపి నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు బయలుదేరాలా కృషి చేయాలన్నారు. అనంతరం ఎన్నికలకు సిద్ధం అన్న బ్రోచర్‌ను ఆవిష్కరించి సిద్ధమా అని నాయ కులను, కార్యకర్తలను ప్రశ్నించారు. సిద్ధమేనని నాయకులు బదులిచ్చారు. ఈ సమావేశానికి వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు పాల్గొనకపోవడంపై పలువురు చర్చించుకున్నారు. కార్యక్రమంలో వైసిపి పరిశీలకులు ఇందుకూరు రఘురామరాజు, తమ్మినేని చిరంజీవి నాగ్‌, గురుగుబెల్లి శ్రీనివాస రావు, బొడ్డేపల్లి నారాయణరావు, నిరంజన్‌, బెవర మల్లేశ్వరరావు, కె.వి.జి.సత్యనారాయణ, సురవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️